సీఈఐఆర్ పోర్టల్‌తో ఫోన్ ట్రాకింగ్
ములుగు: పోగొట్టుకున్న బాధితుల మొబైల్స్‌ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు 55సెల్‌ఫోన్లను సోమవారం ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఈఐఆర్ పోర్టల్‌తో బాధితులు చేసిన ఫిర్యాదులపై స్పందించి స్పెషల్ టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏడాదిలో మొత్తంగా 404 సెల్‌ఫోన్లు కనిపెట్టి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ అవతలి వ్యక్తి వినియోగిస్తేనే ట్రాక్ చేయగలమని తెలిపారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్మితే కొనవద్దన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు కనిపెట్టడంలో విశేష కృషి చేసిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమేష్, కానిస్టేబుళ్లు రాజ్ కుమార్, నాగరాజు, మధును ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ అజయ్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
న్యూ ఇయర్ వేడుకలు సంతోషంగా
జరుపుకోవాలి
న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఎస్సీ శబరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన వేడుకల సందర్భంగా డీజేలు, అధిక శబ్ధం వచ్చే బాక్స్‌లు వినియోగిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు. నేడు రాత్రి జిల్లా పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. బ్రీత్ ఎనలైజర్‌లో తనిఖీలు చేస్తామని, మద్యం సేవించి వాహానాలు నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలను 12.30 లోపు ముగించుకోవాలని సూచించారు. ఈ ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే 100కు సమాచారం ఇస్తే తక్షణమే స్పందించి వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ వివరించారు.
ఎస్పీ శబరీశ్
55 మొబైల్స్ బాధితులకు అప్పగింత
Comments
Please login to add a commentAdd a comment