‘మత్తు’ కట్టడికి..! | - | Sakshi
Sakshi News home page

‘మత్తు’ కట్టడికి..!

Published Thu, Oct 3 2024 1:02 AM | Last Updated on Thu, Oct 3 2024 1:02 AM

‘మత్త

హుందాగా వ్యవహరించాలి

నారాయణపేట: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీనాయకుల భాషతీరు రోజురోజుకు దిగజారిపోతుందని.. హుందాగా వ్యవహరించడం అలవర్చుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీదింటి శివవీర్‌ అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు ప్రజాసమస్యలను గాలికొదిలి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉనికి కోసం, స్వార్థం కోసం పబ్బం గడుపుకుంటున్నాయని దుయ్యబట్టారు. ఈ మధ్యకాలంలో మహిళ నాయకులు సైతం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, కొంతమంది మహిళా నాయకులపై ట్రోల్స్‌ చేయడం బాధ కలిగించే అంశమని ఆవేదన వ్యక్తపరిచారు. అభివృద్ధి చేయడంలో ఒకరికొకరు పోటీ పడలే తప్పా ఒకరిపై విమర్శలు చేసుకోవడం తగదన్నారు.

గ్రామాలు, పట్టణాల్లో

పోలీసుశాఖ నిరంతర తనిఖీలు

వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు

జిల్లాలో ప్రత్యేక బృందాల ఏర్పాటు

నాగర్‌కర్నూల్‌ క్రైం: యువత మత్తుకు బానిసై అసాంఘిక కార్యకలాపాలతో పాటు నేరాలకు పాల్పడుతున్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా ఎస్పీ మత్తు పదార్థాలు విక్రయించేవారు, వినియోగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.

అవగాహన కార్యక్రమాలు..

జిల్లాలోని యువత మత్తు పదార్థాల బారిన పడకుండా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాల్లోని కళాశాలలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇటీవల ఎస్పీ మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలను వివరిస్తూ పాటల సీడీని తయారు చేయించి విడుదల చేశారు.

నిరంతర తనిఖీలు..

జిల్లాలో మత్తు పదార్థాల కట్టడికి ఎకై ్సజ్‌, పోలీసుశాఖ సంయుక్తంగా నిరంతరం తనిఖీలు నిర్వహించనున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ రవాణా కాకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. మత్తు పదార్థాల వినియోగం, విక్రయాల కట్టడికి ప్రత్యేక బృందాలను ఏర్పా టుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణాలు, మండల కేంద్రాల శివార్లను అడ్డాలుగా చేసుకొని కొందరు యువత మత్తు పదార్థాలను తీసుకుంటున్నారని సమాచారం. పలు ప్రాంతాల్లో గంజాయి తాగుతున్నవారిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించిన ఘటనలు ఉన్నాయి.

జిల్లాలో నమోదైన కేసులు..

సంవత్సరం కేసుల సంఖ్య పట్టుబడ్డ గంజాయి

2022 7 3.37 కిలోలు,

4 కిలోల విత్తనాలు

2023 3 700 గ్రాములు

2024 12 318.18 గ్రాములు

కఠినంగా వ్యవహరిస్తాం..

జిల్లాలో మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. పోలీసుశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మత్తు పదార్థాల రవాణాను కట్టడి చేసేందుకు నిరంతరం తనిఖీలు చేపడుతున్నాం.

– గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
‘మత్తు’ కట్టడికి..! 1
1/2

‘మత్తు’ కట్టడికి..!

‘మత్తు’ కట్టడికి..! 2
2/2

‘మత్తు’ కట్టడికి..!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement