నేడు నల్లగొండకు డెడికేటెడ్ కమిషన్ రాక
నల్లగొండ : రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషా విషయమై ప్రజాభిప్రాయ సేకరణ కోసం డెడికేటెడ్ కమిషన్ శనివారం నల్లగొండ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు, సెక్రటరీ బి.సైదులు 16వ తేదీన ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ, ఇతర కుల సంఘాలు, ప్రజలు, సంస్థల నుంచి వ్యక్తిగత అభ్యర్థనలు, సలహాలు, సూచనల సేకరిస్తారని ఆమె తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆయా సంఘాలు.. వారి వాదనలకు మద్దతుగా ఉన్న సమాచారం, మెటీరియల్, ఇతర సాక్ష్యాలతో డెడికేషన్ కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాలను చెప్పవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
18న రాష్ట్ర బీసీ కమిషన్..
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బృందం ఈ నెల 18న నల్లగొండ రానున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన తరగతుల వారి సామాజిక, విద్యా పరమైన స్థితిగతులను తెలుసుకునేందుకు బీసీ కమిషన్ వస్తోందని పేర్కొన్నారు. 18న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ విచారణ చేపడుతుందని తెలిపారు. వ్యక్తిగత, నమోదిత, నమోదు కాని అసోసియేషన్ల నుంచి దరఖాస్తులు, సూచనలు, మద్దతుగా ఉన్న సమాచారం మెటీరియల్, వెరిపికేషన్ అవిడపిట్‌ను బీసీ కమిషన్‌కు అందజేయాలని సూచించారు.
సింగరాజుపల్లి కాల్వల పరిశీలన
డిండి : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలో నూతనంగా నిర్మిస్తున్న సింగరాజుపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించడానికి ఏర్పాటు చేస్తున్న కాల్వ పనులను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు(ఎస్‌ఎల్‌బీసీ యూనిట్–2) శుక్రవారం పరిశీలించారు. కాల్వకు అసరమైన భూ సేకరణలో వీరబోయనపల్లి పరిధిలోని దాదాపు ఆరెకరాలకు నష్ట పరిహారం అందలేదని రైతులు ఇచ్చిన వినతుల మేరకు వివరాలను తెలుసుకున్నారు. ఆయా రైతులకు అసైన్డ్ పట్టా ఉన్నప్పటికీ ఆ భూమి ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని ప్రస్తుతం రైతులకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని తహసీల్దార్ ఆంజనేయులు వివరించారు. ఆయన వెంట ఫారెస్ట్ సెక్షన్ ఆషీసర్ సుబాహనొద్దీన్, బీట్ ఆఫీసర్లు నవీన్, సైదిరెడ్డి, ఆర్‌ఐ శ్యామ్‌నాయక్ ఉన్నారు.
దేశ ప్రగతిలో ఆదివాసీల పాత్ర కీలకం
నల్లగొండ : దేశ ప్రగతిలో ఆదివాసీల పాత్ర కీలకమని భారత ఆహార సంస్థ నల్లగొండ సీనియర్ అధికారి రఘుపతి అన్నారు. భారత ఆహార సంస్థ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన జన జాతీయ గౌరవ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. భారత స్వతంత్య్ర సమరంలో బిర్సా ముండా వంటి గిరిజన నాయకుల పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. షెడ్యూల్డ్ తెగల ప్రజానీకం అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో అధికారులు కేఎన్‌కే.ప్రసాద్, శ్రీనివాసరావు, శంకర్, కాశిరెడ్డి, వంకుడోతు దిలీప్, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment