సర్వే వివరాలు బలవంతంగా సేకరించొద్దు
మునుగోడు : ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే వివరాల కోసం ఎన్యుమరేటర్లు ప్రజలను బలవతం చేయవద్దని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారి, సర్వే రాష్ట్ర పరిశీలకుడు జి.రవిచంద్ర సూచించారు. శుక్రవారం మునుగోడు పట్టణంలో చేపట్టిన సర్వే తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురి ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే సిబ్బంది మిమ్మల్ని ఏఏ ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు ఆ ప్రశ్నలు సమాధానం ఇస్తున్నారా.. ఈ సర్వే వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్యుమనేటర్లు ప్రజలని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సర్వే చేపట్టాలని సూచించారు. ఆయన వెంట పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ వి.కోటేశ్వర్‌రావు, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ ఎం.నరేందర్, ఎంపీడీఓ విజయభాస్కర్, పంచాయతీ కార్యదర్శి మురళి ఉన్నారు.
ఫ రాష్ట్ర పరిశీలకుడు రవిచంద్ర
Comments
Please login to add a commentAdd a comment