క్రీడలతో నాయకత్వ లక్షణాల పెంపు | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో నాయకత్వ లక్షణాల పెంపు

Published Sat, Nov 16 2024 7:58 AM | Last Updated on Sat, Nov 16 2024 7:58 AM

క్రీడలతో నాయకత్వ లక్షణాల పెంపు

క్రీడలతో నాయకత్వ లక్షణాల పెంపు

నల్లగొండ క్రైం : క్రీడలతో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ట్రెయినీ కానిస్టేబుళ్ల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో ఓటమిని స్వీకరిస్తూ విజయానికి కావాల్సిన నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. 9 నెలల శిక్షణకాలంలో క్రమశిక్షణతో నేర్చుకున్న అన్ని అంశాలు విధి నిర్వహణలో ఉపయోగపడతాయన్నారు. పోలీసు విధి నిర్వహణలో ఒత్తిడికి గురి కాకుండా క్రీడలు, వ్యాయామం, యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీటీసీ ఏఎస్పీ రమేష్‌, డీఎస్పీ విఠల్‌రెడ్డి, శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement