నాణ్యతా ప్రమాణాలతో ధాన్యం తేవాలి
నకిరేకల్ : ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలతో కేంద్రాలకు తేవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. నకిరేకల్ మండలం మంగళపల్లి, గోరెంకలపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. వచ్చిన ధాన్యం నిల్వలను, తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు సరైన తేమశాతంతో తాలు, మట్టి పెల్లలు లేకుండా కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే వెంటనే అమ్ముకుని వెళ్లవచ్చన్నారు. 17 శాతం వచ్చిన ధాన్యాన్ని ఆరు గంటల్లో కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి ధ్రువీకరించిన తర్వాతే ఎగుమతి చేయాలన్నారు. ఆమె వెంట ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీసీఓ పత్యానాయక్, సీసీ స్వరుప తదితరులు ఉన్నారు.
పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి
నల్లగొండ : గ్రూప్– 3 పరీక్షల స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్– 3 పరీక్షల స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి మాట్లాడారు. పరీక్ష కేంద్రంలో భద్రపరిచిన ప్రశ్నపత్రాలు, ఇతర కాన్ఫిడెన్షియల్ మెటీరియల్‌ను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. భద్రతపై ఆర్‌సీఓలు, చీఫ్ సూపరింటెండెంట్లకు సూచనలు చేశారు. పరీక్షల నిర్వహణపై ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీఎస్‌పీ శివరామిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment