అంతర్ జిల్లా క్రికెట్ పోటీలకు ఎంపిక
కోదాడరూరల్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా జరిగే అండర్–14 అంతర్ జిల్లా క్రికెట్ పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీమ్‌కు కోదాడకు చెందిన కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు రిత్విక్, ఈశ్వర్ ఎంపికై నట్లు కోచ్ సిద్ధిఖ్ మంగళవారం తెలిపారు. ఇటీవల నల్లగొండలో జరిగిన క్రికెట్ పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారని అన్నారు. రిత్విక్ కోదాడ పట్టణంలోని జయ పాఠశాలలో 9వ తరగతి, ఈశ్వర్ హోలీ ఫ్యామిలీ పాఠశాలో 8వ తరగతి చదువుతూ ఎనమిది నెలలుగా తమ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నట్లు కోచ్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ఎంఈఓ సలీంషరీఫ్, అకాడమీ ప్రెసిడెంట్ కొత్తపల్లి సురేష్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment