ఇసీ్త్ర దుకాణం దగ్ధం
యాదగిరిగుట్ట: పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎస్సీ కాంప్లెక్స్‌లో గౌరారం భిక్షపతికి చెందిన ఇసీ్త్ర దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో దుకాణంలో ఉన్న దుస్తులు, ఫర్నీచర్ దగ్ధయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున ఇసీ్త్ర దుకాణంలో మంటలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు భిక్షపతికి సమాచారం ఇచ్చారు. ఆయన దుకాణం వద్దకు వచ్చేసరికే అందులో ఉన్న ఇసీ్త్ర పెట్టెలు, దుస్తులు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు అప్రమత్తం కావడంతో పక్కన ఉన్న మడిగెలకు మంటలు వ్యాపించలేదు. ఈ ఘటనలో సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని భిక్షపతి తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ బాపట్ల నరహరి ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిక్షపతికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించిన గమన్‌రెడ్డి
నేరేడుచర్ల : హైదరాబాద్‌లోని అల్కాపుర్ టౌన్ షిప్‌లోని సీట్స్ సంస్థలో సోమవారం జరిగిన జాతీయ తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్‌లో నేరేడుచర్లకు చెందిన ఎనిమిదేళ్ల కొణతం గమన్‌రెడ్డి బ్లాక్ బెల్ట్ సాధించాడు. గమన్‌రెడ్డి ఇప్పటి వరకు అండర్–25 కిలోల విభాగంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 7 మెడల్స్ సాధించగా.. అందులో మూడు గోల్డ్, నాలుగు సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. అల్కాపుర్ టౌన్‌షిప్‌లోని స్కాలర్స్ అకాడమీలో నాలుగో తరగతి చదువుతున్న గమన్‌రెడ్డి కోచ్ సైకం సుబ్బారావు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. గమన్‌రెడ్డి బ్లాక్‌బెల్ట్ సాధించడంపై తల్లిదండ్రులు ఉదయ్‌కుమార్‌రెడ్డి–శోభన, తాత నేరేడుచర్ల పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణ రెడ్డి–విజయలక్ష్మి దంపతులు అభినందించారు.
ఉరి వేసుకుని
వ్యక్తి ఆత్మహత్య
మద్దిరాల : మద్యానికి బానిసై ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మద్దిరాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురం గ్రామానికి చెందిన కాసోజు సత్యనారాయణ అనే వ్యక్తి మద్యానికి బానిస కావడంతో ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులు గతంలో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా మద్యం మానకపోగా.. మద్యం మానుకోవాలని వారించిన భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో భార్యతో గొడవపడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందాడని మృతుడి భార్య వినోద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ ఎం. వీరన్న తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment