నలగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇటీవల మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం(సెట్విన్)లో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని శిక్షణ కేంద్రం ఇన్‌చార్జ్ ఎం.సరిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 18లోగా నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల సెట్విన్ కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మొబైల్ సర్వీసింగ్, సీసీటీవీ ఇన్సాలేషన్ సర్వీసింగ్, ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్, ఆటోమొబైల్ కోర్సులలో డిప్లమో, ఏదేని యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండడంతోపాటు అనుభవం ఉన్నవా రికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కంప్యూటర్స్ ఎంసీఎ, ఎంఎస్‌సీ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్ పూర్తి చేసినవారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుందని, ఈ ఉద్యోగాలు తాత్కాలికమని రెగ్యులర్ చేయబడవని తెలిపారు. పూర్తి వివరాలకు సెట్విన్ కేంద్రం ఇన్‌చార్జ్ సెల్ 97050441789 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment