ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి
భూదాన్‌పోచంపల్లి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో నిర్వహించిన పీవైఎల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 30 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని, ఇంకా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. గంజాయి, డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాణ్యమైన విద్య, వైద్యం అందకపోవడంతో పేదప్రజలు ప్రైవేట్‌ను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఈనెల 16న చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర సహాయకార్యదర్శి బేజాడి కుమార్, జిల్లా అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, జిల్లా నాయకులు పగుడాల శివ, చిరబోయిన బాలకృష్ణ, చకిలం వెంకటేశ్, ఆకుల కృష్ణ, మోహన్‌రెడ్డి, నవీన్, కిషోర్, బుచ్చయ్య, బాలనర్సింహ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment