ఐటీ టవర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ
నల్లగొండ : నల్లగొండ ఐటీ టవర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ డిప్యూటీ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నల్లగొండలోని ఐటీ టవర్‌ను సందర్శించారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణకు ఉద్యోగులను గుర్తించడంతోపాటు, 20 బ్యాచ్‌లుగా విభజించాలని కలెక్టర్‌ఉ సూచించారు. ఐటీ టవర్‌లో జపాన్‌కు చెందిన ఓ కంపెనీ 500 మంది ఉద్యోగులతో తన కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, ఐటీ టవర్ మేనేజర్ నాగరాజు, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment