చిలుకూరు: కాలనీవాసులకు బ్యాంక్ లోన్ ఇప్పించిన ఓ వ్యక్తి ఆ డబ్బులతో పరారయ్యాడు. ఈ ఘ టన శుక్రవారం చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఇల్లు ఉంటే చాలు కోదాడకు చెందిన ప్రైవేట్ బ్యాంక్‌లో స్వల్పకాలిక రుణాలు ఇస్తున్నారని జెర్రిపోతులగూడెం ఎస్సీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి కాలనీ వాసులకు నమ్మబలికాడు. దీంతో కాలనీకి చెందిన 20 మందికి పైగా ధ్రువపత్రాలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ వారు కాలనీకి వచ్చి వారి చేత సంతకాలు చేయించుకుని ఒక్కొక్కరికి రూ. 40 వేలు లోన్ మంజూరు చేశారు. వారి అ కౌంట్‌లో డబ్బులు పడగానే ఆ వ్యక్తి తిరిగి కొంత మందితో డ్రా చేయించి వారి నుంచి తీసుకున్నాడు. మరికొంత మందితో బ్యాంక్ విత్‌డ్రా ఓచర్స్‌పై సంతకాలు చేయించుకున్నట్లు తెలిసింది. మొత్తంగా వా రి నుంచి సుమారుగా రూ.9 లక్షల వరకు తీసుకున్నాడు. ఈ వ్యవహారం జరిగి రెండు నెలలు అవుతుంది.
సర్వే కోసం అధికారులు కాలనీకి
వెళ్లడంతో విషయం వెలుగులోకి..
లోన్ తీసుకున్న వారు డబ్బులను బ్యాంక్‌లో ఒకటి, రెండు వారాలు చెల్లించి, తరువాత చెల్లించకపోవడంతో బ్యాంక్ సిబ్బంది బాధితుల వద్దకు వచ్చారు. లోన్ డబ్బులు తీసుకున్న వ్యక్తి మాకు ఇంతవరకు ఇవ్వలేదని, వారం రోజులుగా అతను కాలనీలో కనిపించడం లేదని, ఆ డబ్బులను మేము ఎలా చెల్లించాలని తెలిపారు. దీంతో అవన్నీ మాకు సంబంధం లేదనీ.. మీ అకౌంట్‌లో డబ్బులు వేశాం.. మీరు చెల్లించాల్సిందే అని బ్యాంక్ సిబ్బంది తేల్చిచెప్పారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి పరారు కావడంతో బాధితులు తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం అధికారులు కాలనీకి వెళ్లారు. వారిని ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఇవ్వమని అడిగితే రెండు నెలల క్రితం ఇలాగే ఒకరిని నమ్మి కాగితాలు ఇస్తే తమ పేరుతో లోన్లు తీసుకుని పరారయ్యాడని, ఇప్పుడు ఎలాంటి కాగితాలు ఇవ్వబోమని చెప్పడంతో ఈ విషయం బయటపడింది.
ఫ జెర్రిపోతులగూడెంలో
ఆలస్యంగా వెలుగులోకి
Comments
Please login to add a commentAdd a comment