నడిగూడెం : రోడ్డుప్రమాదంలో గాయపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం గ్రామానికి చెందిన రామిని వెంకటరెడ్డి (60) గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 18న హైదరాబాద్‌లో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన వెంకటరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
గుర్తు తెలియని వాహనం
ఢీకొని డీసీఎం డ్రైవర్ మృతి
చివ్వెంల(సూర్యాపేట): గుర్తు తెలియని వాహనం ఢీకొని డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలిసుల వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం ఎరసానిగూడెం గ్రామానికి చెందిన రేపాక సురేందర్‌రెడ్డి (49) వృత్తి రీత్యా డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లోని మేడ్చల్ నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి తన డీసీఎంలో టెలిఫోన్ టవర్స్ ఫ్యాడ్స్ లోడ్‌తో వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఐలాపురం గ్రామ శివారులో ఎదురుగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఇతడి డీసీఎంను ఢీకొట్టింది. దీంతో సురేందర్‌రెడ్డికి తలకు, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బావమరిది వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కనక రత్నం కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment