బైక్‌ల చోరీ ముఠా అరెస్టు
కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి, చింతపల్లి, దేవరకొండ, డిండి ప్రాంతాల్లో బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10లక్షల విలువైన 17 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం దేవరకొండ డీఎస్పీ గిరిబాబు వెల్లడించారు. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన భక్తోజు శివ అలియాస్ లడ్డూ, గౌతమ్ అలియాస్ చింటు, వరికుప్పల అశోక్, సురకారపు శివ అలియాస్ కరీం ఒక ముఠాగా ఏర్పడి బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా పోలీస్ స్టేషన్‌లలో బైకుల చోరీకి సంబంధించి బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో స్పందించిన పోలీసు శాఖ ఎస్పీ శరత్‌చంద్రపవార్ ఆదేశాల మేరకు దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి సీఐ, ఎస్‌ఐ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొండమల్లేపల్లి చౌరస్తా వద్ద శుక్రవారం పట్టుబడిన ముఠాసభ్యులను విచారించగా జల్సాలు, చెడు అలవాట్లకు బానిసై రాత్రి సమయాల్లో ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన బైక్‌లను దొంగిలించినట్లు వారు అంగీకరించారు. చింతపల్లి, మాడ్గుల, యాచారం మండలాల పరిధిలో 17 బైకులను దొంగలించినట్లు నిర్ధారించారు. ఈ మేరకు రూ.10లక్షల విలువైన 17 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చేధించడంలో కీలక పాత్ర పోషించిన కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ, ఎస్‌ఐలు రామ్మూర్తి, నర్సింహులు, క్రైమ్ సిబ్బంది హేమునాయక్, భాస్కర్, వెంకటేష్, శేఖర్‌రెడ్డి,, హోం గార్డు లక్ష్మయ్య, రమేష్‌లను ఎస్పీ అభినందించి రివార్డు అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు.
ఫ రూ.10లక్షల విలువైన
17 మోటారు సైకిళ్లు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment