చివరి ఆయకట్టుకు నీరందేలా చూడాలి
నల్లగొండ : సాగర్ ఎడమకాలువ చివరి భూములకు నీరందేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని చీఫ్ ఇంజినీర్ (సీఈ) వి.అజయ్‌కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎడమ కాలువ కింద మొత్తం 6.30 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారని తెలిపారు. ఎగువ రైతులు క్వాలకు గండ్లు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యాసంగి పంటకు ఈ నెల 15 నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో అందిస్తున్నట్లు తెలిపారు. మొదటి దఫాలో యాసంగి నాట్లు పడేంత వరకు 27 రోజులు నిరంతరాయంగా నీరు అందిస్తామన్నారు. మిగిలిన ఆరు దఫాల్లో 9 రోజులు చొప్పున నీరు ఇస్తామని.. ఆరు రోజులు బంద్ చేస్తామని తెలిపారు. ఏఎమ్మార్పీ హైలెవల్ కెనాల్ కింద 1.97 లక్షల ఎకరాల ఆయకట్టుకు, లో లెవల్ కెనాల్ కింద 42,950 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment