నల్లగొండ : క్రీడాపోటీల్లో గెలుపు ఓటములు సహజమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో 20 రోజులుగా నిర్వహిస్తున్న నల్లగొండ ప్రీమియర్ లీగ్ (ఎన్‌పీఎల్) క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంతి మాట్లాడుతూ ఎన్జీ కళాశాల మైదానాన్ని భవిష్యత్‌లో అందరికీ అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా ఎస్‌ఎల్‌బీసీకి రూ.4 వేల కోట్లు మంజూరు చేయించి, టన్నెల్ తవ్వే మిషన్ బేరింగ్‌ను అమెరికా నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. ఎంజీ యూని వర్సిటీలో రెండు కొత్త బ్లాక్‌లు నిర్మిస్తున్నామని, ఐటీ టవర్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలి పారు. లతీఫ్‌సాబ్ గుట్టను రూ.107 కోట్లతో టూ రిజం కేంద్రంగా మార్చేందుకు టెండర్లు పిలిచామని చెప్పారు.
విజేతలకు బహుమతులు
శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మార్నింగ్ లెజెండ్ జట్టు విజేతగా నిలువగా.. రూ.2,00,116, రన్నరప్‌గా నిలిచిన ఆర్పీఎన్ జట్టుకు రూ.1,00,116 నగదు, ట్రోఫీలను మంత్రి కోమటిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూనే శారీరకంగా దృఢంగా ఉండాలన్నారు. ఆరోగ్యంతో పాటు, చదువుపై కూడా దృష్టి పెట్టాలని క్రీడాకారులకు సూచించారు. ఎస్పీ శరత్‌చంద్రపవార్ మాట్లాడుతూ క్రీడలు మనిషి జీవితంలో ముఖ్యమని, ఓడినవారు.. గెలిచినవారిని స్ఫూర్తిగా తీసుకొని ఆటలాడాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ ముగిసిన ఎన్‌పీఎల్ క్రికెట్ టోర్నమెంట్
Comments
Please login to add a commentAdd a comment