కాల్వలను మార్చిలోగా పూర్తిచేయాలి
నల్లగొండ : బ్రాహ్మణవెల్లెంల – ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం కాల్వలను మార్చిలోగా పూర్తిచేసి చెరువులు నింపి మొదటి దశలో 50,000 ఎకరాలకు సాగునీరు అందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్‌పై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. కెనాల్ పనుల భూసేకరణకు ప్రభుత్వం రూ.37 కోట్లు మంజూరు చేసిందని.. మరో రూ.35 కోట్లను వారం రోజుల్లో విడుదల చేయనుందని తెలిపారు. సమావేశంలో ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment