ఏడాదిగా ప్రజలకు ఒరిగిందేమీ లేదు
దేవరకొండ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏడాదిగా తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి, తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టేందుకు ఫార్ములా–ఈ రేస్ నిర్వహించామన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేటీఆర్‌పై చిల్లర కేసులు పెట్టడం సరికాదన్నారు. సమావేశంలో టీవీఎన్ రెడ్డి, గాజుల ఆంజనేయులు, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, పల్లా లోహిత్‌రెడ్డి, ఉపేందర్, తులసీరాం, ఖాదర్‌బాబా, అఫ్రోజ్, గోవర్ధన్ తదితరులు ఉన్నారు.
ఫ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్
Comments
Please login to add a commentAdd a comment