నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
నల్లగొండ క్రైం : జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ శరత్‌చంద్రపవార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎలాంటి నేర సంఘటనలు జరుగకుండా నిరంతరం నిఘా ఉంచాలని దొంగతనాలు, గంజాయి, రేషన్ బియ్యం, పేకాట లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగకుండా చూడాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరష్కరించి కోర్టు ద్వారా నేరస్తులకు శిక్ష పడితేనే బాధితులకు పోలీస్ శాఖపై భరోసా కలుగుతుందన్నారు. ప్రతి అధికారికి పూర్తిస్థాయిలో విచారణ, స్టేషన్ నిర్వహణ తెలిసి ఉండాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. మహిళా భద్రతకు భరోసా కల్పిస్తు వారి రక్షణే ధ్యేయంగా సేవలు అందించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలని, అతివేగం, త్రిబుల్ రైడింగ్, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటి వాటిపై దృష్టి సారించి ప్రత్యేక తనిఖీ చేయాలన్నారు. గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణ జరగకుండా నిఘా పెట్టాలన్నారు. పదే పదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ రాములునాయక్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్‌రాజు, గిరిబాబు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
Comments
Please login to add a commentAdd a comment