యోగా, చెస్‌తో మానసిక దృఢత్వం
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు యోగా, చెస్ ద్వారా మానసిక దృఢత్వం కలిగి ఉంటారని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి అన్నారు. సీఎం కప్ జిల్లాస్థాయి పోటీల్లో భాగంగా శుక్రవారం నల్లగొండలో యోగా, చెస్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెస్ ఆడడం ద్వారా విజ్ఞానం పెరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడాలో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి దగ్గుపాటి విమల, వాడపల్లి రవీందర్, కవిత, కరుణాకర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, నాగరాజు, మాణిక్యం, నుస్రఫ్, అష్రఫ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment