త్రిపురారం : మండలంలోని రాజేంద్రనగర్ మండల పరిషత్ పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న ఎన్.వెంకన్నపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా విధ్యాధికారి భిక్షపతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం త్రిపురారం ఎంఈఓ రవినాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పాఠశాలలో ఎస్‌జీటీ వెంకన్న కొంతకాలంగా విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడంతో రెండు నెలలు జీతం నిలుపుదల చేశామన్నారు. అయినా సదరు ఉపాధ్యాయుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో డీఈఓకు నివేదిక పంపామన్నారు. దీంతో వెంకన్నను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment