ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి
నల్లగొండ : ఉపాధ్యాయలు బైక్‌పై హెల్మెట్ ధరించి పాఠశాలకు వస్తేనే వారికి అటెండెన్స్ వేయాలని ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్.వాణి హెడ్మాస్టర్లకు సూచించారు. శుక్రవారం డాన్‌బాస్కో పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సభ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చేతుల మీదుగా.. రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం వాణి మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈ నెల 31వ తేదీ వరకు జరుగుతాయన్నారు. మన భద్రత కోసమే రోడ్డు భద్రతా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో ఊహించుకుంటేనే బాధ కలుగుతుందన్నారు. వాహనం నడిపేప్పుడు నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి, జూకూరి రమేష్, వంగూరి లక్ష్మయ్య, ఆర్‌టీఏ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment