కాళీయమర్ధనుడిగా ఊరేగి
వెన్నముద్ద చేతబట్టి..
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఆలయంలో నిత్యారాధనలు జరిపించారు. అనంతరం దివ్య ప్రబంధ పారాయణములు పారాయణీకులచే నిర్వహించారు. స్వామివారిని వెన్నముద్ద కృష్ణుడిగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. సేవోత్సవం తరువాత ఆలయ అద్దాల మండపంలో స్వామిని, ఆళ్వారులను, అమ్మవారిని అధిష్ఠించి ప్రత్యేక పూజలు, పారాయణాలు పఠించారు. సాయంత్రం నిత్యారాధనలు ఆగమశాస్త్ర ప్రకారం జరిపించారు. అనంతరం ద్రవిడ ప్రబంధ సేవా కాలము నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని కాళీయమర్ధనుడిగా అలంకరించి ఊరేగించారు. సేవోత్సవం అనంతరం ఆలయ అద్దాల మండపంలో అధిష్ఠించి, అలంకార విశిష్టతను ఆచార్యులు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు, పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు
వెన్నముద్ద కృష్ణుడి అలంకార సేవను ఊరేగిస్తున్న అర్చకులు, ఆలయ అధికారులు
యాదగిరిగుట్టలో వైభవంగా
కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment