వరిలో కలుపు నివారణ చర్యలు
నడిగూడెం: ప్రస్తుత యాసంగి సీజన్‌లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఇప్పటి నుంచి వరిలో కలుపు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక పంట దిగుబడి సాధించవచ్చని నడిగూడెం మండల వ్యవసాయాధికారి రాయపు దేవప్రసాద్ చెబుతున్నారు. వరిలో కలుపు నివారణకు ఆయన సలహాలు, సూచనలు..
● నాటిన 3 నుంచి 5 రోజుల లోపు ఎకరానికి బ్యూటాక్లోర్ 1–1.5 లీటర్లు లేదా ప్రెటిలాక్లోర్ 500–600 మి.లీ. లేదా ఆక్సాడయార్జికల్ 35–40 గ్రాములు లేదా బెన్ సల్పూరాన్ మిథైల్ (0.6 శాతం)+ప్రెటిలాక్లోర్ (6.0శాతం) 4 కిలోల గుళికలు, పైరజోసల్పూరాన్ ఈథైల్+ప్రెటిలాక్లోర్ 6.15 గుళికలు 4 కిలోలు లేదా నాటిన 8–10 రోజుల లోపు పైరజోసల్పూరాన్ ఇథైల్ 80–100 గ్రాములు 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి.
● నాటిన 15–20 రోజులకు ఎకరానికి సైహలోఫాస్ పిబ్యూటైల్ 250–300 మి.లీ. లేదా ఫినాకి్ట్రపాప్ పి ఈథైల్ 250–300 మి.లీ. లేదా మెట్ సల్పూరాన్ మిథైల్+క్లోరిమ్యురాన్ ఇథైల్ అనే మందును 8 గ్రాములు లేదా పెనాక్సులామ్+సైహలోఫాప్ బ్యుటైల్ 1.6 – 1.8 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
● వెడల్పాకు కలుపు నివారణకు నాటిన 25–30 రోజులకు 2,4–డి సోడియం సాల్ట్ అనే మందు ఎకరానికి 500–600 గ్రాములు లేదా 2,4డి 1.25–1.50 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
● గడ్డిజాతి మరియు వెడల్పాకు కలుపు నివారణకు బిస్‌పైరిబాక్ సోడియంను ఎకరానికి 100 మి.లీ. (అనగా లీటరు నీటికి 0.5 మి.లీ. మందును) 200 లీటర్ల నీటికి కలిపి 15 నుండి 20 రోజుల మద్య పిచికారీ చేయాలి.
కోనో వీడర్, పవర్ వీడర్‌తో
అదనపు దిగుబడి
శ్రీ పద్ధతిలో, డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగుచేసిన వరి పొలాల్లో అయితే పవర్ వీడర్ లేదా కోనో వీడర్ పరికరాల ద్వారా కలుపు తీస్తే పంట దిగుబడి అదనంగా వస్తుంది. నాటు పెట్టిన 10 రోజుల తర్వాత నుంచి వారం, పది రోజుల వ్యవధిలో నాలుగైదుసార్లు కలుపు తీయాలి. ఇలా చేయడం వలన పొలంలో పెరిగిన కలుపు పంటకు పచ్చి రొట్ట ఎరువుగా ఉపయోగపడుతుంది. దీంతో పొలంలో పిలకలు, దుబ్బులు బాగా వస్తాయి. గాలి, వెలుతురు బాగా సోకడం వలన చీడపీడల సమస్య తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment