జైల్‌ఖానా అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో 26 ఏసీలు ఏర్పాటు చేశాం. రూ.60 లక్షలతో చిన్న పిల్లల వార్డులో వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్లు సమకూర్చాం. ప్రసవానికి ముందు వచ్చే గర్భిణులు ఉండేందుకు రూ.1.25 కోట్లతో 45 బెడ్ల సామర్థ్యం కలిగిన ప్రీకాస్ట్ భవనం నిర్మిస్తున్నాం. రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ భవనాన్ని నిర్మించబోతున్నాం. దంత వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మాణ బిల్లులు ఇవ్వలేదు. మంత్రి కోమటిరెడ్డి ఆ బిల్లులను ఇప్పించి పూర్తి చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.12 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మించాం. పాత భవనం కూలగొట్టి కొత్త భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టాం.
Comments
Please login to add a commentAdd a comment