సంక్రాంతి పండుగకు వెళ్లొస్తూ..
చిట్యాల: సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో సోమవారం జరిగింది. చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామానికి చెందిన జువ్వనపూడి విక్రమ్(26) కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లిన విక్రమ్ సోమవారం బైక్‌పై తిరిగి హైదరాబాద్‌కు పయణమయ్యాడు. మార్గమధ్యలో చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వచ్చిన బొలేరో వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విక్రమ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, మృతుడి సోదరి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్‌ఐ ధర్మా తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment