పోచంపల్లిలో ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులు
భూదాన్‌పోచంపల్లి: హైదరాబాద్‌లోని లకోటియా కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్స్ కాలేజీకి చెందిన 90 మంది విద్యార్థులు శనివారం పోచంపల్లిని సందర్శించారు. ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫ్యాషన్ ఫొటోగ్రఫి డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు స్టడీటూర్‌లో భాగంగా కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, టూరిజం పార్కు, చేనేత గృహాలను సందర్శించారు. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌లో వస్త్రాలు ఎలా తయారవుతాయో ప్రత్యక్షంగా చూశారు. ఇక్కత్ అంటే ఏమిటి, అనుసరిస్తున్న డిజైన్లు, వస్త్రాల నాణ్యతను పరిశీలించి చేనేత కళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. పోచంపల్లి ఇక్కత్ డిజైన్లు నేటి ఫ్యాషన్ రంగానికి, ఇంటీరియర్‌కు ఎంతో అనువుగా ఉంటాయని విద్యార్థులు కొనియాడారు. వీరికి కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్ నిర్వాహకుడు సాయిని భరత్ గైడ్ చేశారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ మహ్మద్ అజహరుద్దీన్ ముజాహీద్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫన్ ముజాహిద్, డైరెక్టర్ గుఫ్రాన్ ముజాహిద్దీన్, సెంట్రల్ మేనేజర్ భానుప్రియ, హెచ్‌ఓడీ ఫ్యాషన్స్ రుక్సానా, ఫ్యాకల్టీ సుష్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment