రెండో రోజు నామినేషన్లు నిల్
నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంగళవారం ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. మొదటి రోజు కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేష్ల స్వీకరణ కొనసాగనుంది.
ప్రశాంతంగా ప్రాక్టికల్స్
నల్లగొండ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఉద యం జరిగిన ప్రాక్టికల్ పరీక్షకు మొత్తం (జనరల్, ఒకేషనల్) విద్యార్థులు 3074 మంది హాజరుకావాల్సి ఉండగా.. 2,820 మంది హాజ రయ్యారు. 255 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2280 మంది హాజరుకావాల్సి ఉండగా.. 2,183 మంది హాజరయ్యారు. 97 మంది గైర్హాజరయ్యారు.
పాడి రైతులు
ఆర్థికాభివృద్ధి సాధించాలి
కట్టంగూర్ : పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి డాక్టర్ రాజశేఖర్ అన్నారు. పశుసంవర్ధక, పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ఎరసానిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాడి రైతులు కత్రిమ గర్భధారణ సేవలు వినియోగించుకొని అధిక పాల దిగుబడినిచ్చే మేలుజాతి దూడలను పొంది రైతులు లాభాలు గడించాలన్నారు. ఈ సందర్భంగా గేదెలకు గర్భకోశ వ్యాధి నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడలకు పశువైద్య సిబ్బంది నట్టల నివారణ మందు, టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శ్రావణి, శ్రీనివాస్‌రెడ్డి, సూపర్‌వైజర్ సాయికుమార్, చెరుకు శ్రీనివాస్, కావటి యాదగిరి ఉన్నారు.
నల్లగొండకు చేరిన ఆర్టిజన్ కన్వర్షన్ యాత్ర
నల్లగొండ : మహబూబ్‌నగర్‌లో ప్రారంభమైన విద్యుత్ ఉద్యోగుల ఆర్టిజన్ కన్వర్షన్ యాత్ర మంగళవారం నల్లగొండకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్‌రావు మాట్లాడుతూ ఆర్టిజన్ కన్వర్షన్ అయ్యేంత వరకు వివిధ సంఘాలు, అసోసియేషన్ల మద్దతుతో పోరాటం సాగిస్తామన్నారు. ఈ నెల 20న నిర్వహించే చలో విద్యుత్‌సౌద కార్యక్రమానికి ఉద్యోగులు కుటుంబ సభ్యులతో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కన్వీనర్ వజీర్ మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు వెన్నమల్ల నరేందర్, చింత యల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి, పెరుమళ్ల మురళి, చంద్రారెడ్డి, సదానందం, పెరిక శేఖర్, మారయ్య, నకులుడు, అహ్మద్, బాలరాజు, హతీరాం, లింగస్వామి, లింగారెడ్డి, విజయ్, నాగమణి, శైలజ, లతీప్, విజయ్‌కుమార్, సతీష్ పాల్గొన్నారు.
హనుమంతుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment