రామగిరి(నల్లగొండ) : పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్‌ఎం జానిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రతీ పౌర్ణమికి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బస్సులో ప్రయాణించే వారికి ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, తమిళనాడు వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ : 9298008888, లేదా సమీప బస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment