‘పరిషత్’ పోరుకు సన్నద్ధం
నల్లగొండ : మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే మొదట నిర్వహిస్తామని చెబుతుండడంతో తిరిగి యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
పెరిగిన ఎంపీటీసీ,
జెడ్పీటీసీ స్థానాలు..
2016లో జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలో 31 మండలాలు ఉండగా వాటి పరిధిలో 31 జెడ్పీటీసీ, 349 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ఆ తర్వాత జిల్లాలో రెండు మండలాలను పెంచారు. గట్టుప్పల్, గుడిపల్లి మండలాలు ఏర్పడడంతో మండలాల సంఖ్య 33కు పెరిగింది. దీంతో జెడ్పీటీసీలు కూడా 33 కానున్నాయి. ఎంపీటీసీల పునర్విభజన చేపట్టడంతో మూడు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దీంతో ఎంపీసీటీల సంఖ్య 352కు చేరింది.
పంచాయతీ జాబితా
ఆధారంగానే..
ప్రభుత్వం మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పడంతో ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఇప్పటికే సిద్ధంగా ఉన్న పంచాయతీ ఓటర్ల జాబితా ఆధారంగా.. ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం 3,676 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు. వాటినే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఉపయోగించనున్నారు.
బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే నిర్వహిస్తారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి పోటీ చేసే అభ్యర్థులు ఖరారైన తర్వాత వారి గుర్తులతో బ్యాలెట్ పేపర్లను ముద్రించనున్నారు.
ఫ ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ
ఎన్నికలు నిర్వహించే అవకాశం
ఫ జిల్లాలో పెరిగిన మూడు ఎంపీటీసీ,
రెండు జెడ్పీటీసీ స్థానాలు
ఫ ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధమైన యంత్రాంగం
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడొచ్చిన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేస్తాం. ఓటరు జాబితాపై పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తాం.
– ప్రేమ్ కరణ్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment