పోలీస్ క్రీడాకారులకు ఎస్పీ అభినందన
నల్లగొండ : కరీంనగర్‌లో జరిగిన 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2025 క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన నల్లగొండ జిల్లా పోలీస్ క్రీడాకారులను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు. స్పోర్ట్స్ మీట్‌లో 800 మీటర్ల రన్నింగ్ మెన్, ఉమెన్‌లో 2 బంగారు పతకాలు, స్విమ్మింగ్‌లో 2 బంగారు పతకాలు, 2 సిల్వర్ పతకాలు, 1500 మీటర్లు రన్నింగ్ ఉమెన్ పోటీల్లో 1 సిల్వర్, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సిల్వర్, వాలీబాల్, కబడ్డీలో సిల్వర్ పతకం, హాకీలో కాంస్య పతకం సాధించారు. వీరు మంగళవారం ఎస్పీని కలిశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్‌ఐలు హరిబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment