ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
నల్లగొండ టూటౌన్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న పులి సరోత్తమ్‌రెడ్డిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కోరారు. మంగళవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తమ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చలేదని, మండలిలో ఉపాధ్యాయుల సమస్యలపై ప్రశ్నించే పార్టీ బీజేపీ అని, బీజేపీ అభ్యర్థి గెలిస్తేనే ప్రభుత్వాన్ని నిలదీసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాడని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని, వారి హక్కుల కోసం పోరాడిన అనుభవం కూడా ఉందన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికై న డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు కేక్‌కట్ చేయించి ఘనంగా సన్మానించారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, రావెల్లి కాశమ్మ, శ్రీలతారెడ్డి, మిర్యాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment