మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
నల్లగొండ : గ్రామీణ మహిళలు జాతీయస్థాయి వ్యాపార వేత్తలుగా ఎదగాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. మంగళవారం నల్లగొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన చేనేత, హస్త కళల, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన (మినీ సరస్ ఫెయిర్–2025)ను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన మద్దతు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో తొలిసారి నల్లగొండలో సరస్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల్ని సోషల్ మీడియా, అమెజాన్ లాంటి ఆన్‌లైన్ మార్కెట్‌లో కూడా మార్కెటింగ్ చేయాలని సూచించారు. పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్ పిడబ్ల్యూ.జాన్సన్ మాట్లాడుతూ గ్రామీణ మహిళా సంఘాలు అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ముందుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ సంచాలకుడు జి.కోటేశ్వరరావు, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ, పరిశ్రమల శాఖ జీఎం వి.కోటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
8వ తేదీ వరకు సరస్ ప్రదర్శన...
గ్రామీణ మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన ఈ నెల 8వ తేదీ వరకు నల్లగొండలోని టీటీడీ కల్యాణ మండపంలో కొనసాగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని.. వందకు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ మినీ సరస్ ఫెయిర్–2025 ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment