అతివేగం ప్రమాదకరం
● ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా
బొమ్మలసత్రం: రహదారులపై అతివేగంతో వెళ్తే వాహనదారుని ప్రాణాలకే ప్రమాదమని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఎంవీఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రహదారులపై వాహనాలను నిబంధనల మేరకు నడపాలన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 15 వరకు మాసోత్సవాలు జరుపుతున్నామన్నారు. ప్రతి విద్యాలయాల్లో, ఆటో డ్రైవర్లకు, ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్‌బాబు, ఎంవీఐ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి
నంద్యాల (వ్యవసాయం): రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టీసీ డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ప్రజా రవాణాధికారి రజియా సుల్తానా అన్నారు. రోడ్డు భద్రత మసోత్సవాల సందర్భంగా నంద్యాల ఆర్టీసీ డిపోలో గురువారం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. వన్‌టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి , ట్రాఫిక్ ఎస్‌ఐ మధు, డిపో మేనేజర్ గంగాధర్ రావు, అసిస్టెంట్ మేనేజర్ మాధవి, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment