విషం పొంగుతోంది! | - | Sakshi
Sakshi News home page

విషం పొంగుతోంది!

Published Fri, Jan 17 2025 1:36 AM | Last Updated on Fri, Jan 17 2025 1:36 AM

విషం

విషం పొంగుతోంది!

జిల్లాలో ఆక్సిటోసిన్‌ విచ్చలవిడిగా

వినియోగం

పాడిపశువుల పాలసేపునకు

నిషేధ ఇంజెక్షన్‌

కర్ణాటక రాష్ట్రం నుంచి

పెద్ద ఎత్తున దిగుమతి

స్పందించని పశుసంవర్ధక శాఖ

అధికారులు

కర్నూలు (అగ్రికల్చర్‌): పశువైద్యుల సిఫార్సు లేకుండా ఆక్సిటోసినన్‌ ఇంజెక్షన్‌ వినియోగించరాదని ప్రభు త్వం కొన్నేళ్ల క్రితమే ఆదేశాలు ఇచ్చింది. అయితే ఉమ్మ డి కర్నూలు జిల్లాలో సగం మంది పాడి పరిశ్రమల నిర్వాహకుల్లో దీనిని వాడుతున్నారు. దీని ప్రభావంతో నాలుగైదు నిమిషాల్లోనే పాడిపశువులు సేపునకు వస్తా యి. ఇలాంటి పాలు తాగడంతో పిల్లల్లో దృష్టిలోపం, వినికిడి లోపం వస్తోంది. సూదులు వేసిన పశువుల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. పాల సేపునకు ఆక్సిటోసిన్‌ సూదులను వినియోగించకుండా నివారించాల్సిన పశుసంవర్ధక శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధిక పాల కోసం..

ప్రస్తుతం కొందరు పాడి పరిశ్రమ నిర్వాహకులు ‘ఆక్సిటోసిన్‌’ ఇంజెక్షన్‌ను కేవలం అధిక పాల ఉత్పత్తి కోసం వాడుతున్నారు. సాధారణంగా గేదెలు శరీరంలో ఉండే మొత్తం పాలను బయటకు ఇవ్వవు. పొదుగులో ఉండే మొత్తం పాలు పిండినప్పుడు సులువుగా వచ్చేస్తుంది. అయితే వాటి శరీర కండరాల్లో, ఎముకల మూలన ఇంకా కొంత పాలు అలానే ఉంటుంది. ఎప్పుడైతే ఇంజె క్షన్‌ వాడుతారో గేదె శరీర కండరాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. సాధారణంగా ఐదు లీటర్ల పాలు ఇచ్చే గేదెం ఈ ఇంజెక్షన్‌తో శరీరం ఉత్తేజాన్ని గురై మరో రెండు, మూడు లీటర్ల పాలు అధికంగా ఇస్తుంది.

దూడలను దూరం చేస్తూ..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాడి పరిశ్రమ నేడు వ్యాపా రం అయ్యింది. దూడలకు వదిలితే పాలు తక్కువవుతాయనే ఉద్దేశం చాలా మందిలో ఉంది. వాటికి పాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో కొద్ది రోజులకే మృత్యవాత పడుతున్నాయి. పాడి పశువుల్లో 40 శాతం వరకు మగదూడలు పుడుతున్నాయి. అయితే వీటిని సరిగ్గా పట్టించుకోకపోవడం లేదు. పెయ్య దూడల పోషణలోనూ సరైన శ్రద్ధ వహించకపోవడంతో వాటిలో 20 శాతం వరకు మూడు నెలల్లోనే మృత్యువాత పడుతున్నాయి. దూడలు లేని పాడి పశువులకు ఈ సూది వేస్తున్నారు. సేపునకు తెచ్చుకొని పాలు పితుకుతున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా..

ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ సూది వినియోగంపై కట్టడి చేయడంతో పాడిపరిశ్రమ నిర్వాహకులు గుట్టుచప్పుడు కా కుండా కర్ణాటక రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా కూడా కొందరు చాటుగా విక్రయి స్తున్నట్లు సమాచారం. కర్ణాటక నుంచి ఒకేసారి 500 ఎంఎం తెచ్చుకొని, ఒక ఎంఎల్‌ ఒక డోసుగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో పాల ఉత్పత్తి తగ్గింది. కొన్నేళ్లుగా విద్యావంతులు, ఇంకొందరు పాడి పరిశ్ర మలో రాణిస్తున్నారు. అయితే దూడలను పట్టించుకోకుండా వాటి మృత్యువుకు కారణమవుతున్నారు.

స్వస్తి పలకాలి

పాలు పితకడానికి ముందు కొద్ది సేపు దూడలను వదిలితే పాడిపశువులు సేపునకు వస్తాయి. ఫలితంగా పశువు ఆరోగ్యం బాగుండి వెంటనే ఎదకు వస్తుంది. పాలసేపునకు ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్‌ను ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. దీనిని వాడితే పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ సూదులు పని చేయడం లేదు. రైతులు, డెయిరీ నిర్వాహకులు ఆక్సిటోసిన్‌ సూదితో పరోక్షంగా నష్టపోతున్నారు. దీనికి స్వస్తి పలకాలి.

– ఆర్‌.నాగరాజు, సహాయ సంచాకులు,

పశుసంవర్ధక శాఖ, డోన్‌

కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామంలో 2018లో ఒక పాడి పరిశ్రమ నిర్వాహకుడి దగ్గర ఆక్సిటోసిన్‌ 100 ఎంఎల్‌ నాలుగు బాటిళ్లను డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి సీజ్‌ చేయడంతో పాటు కేసు నమోదు చేశారు. తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిఘాను కట్టుదిట్టం చేసింది. పశుపోషకుల షెడ్ల వద్ద దాడులు విస్తృతం చేసింది. ఇంతవరకు ఆక్సిటోసిన్‌ దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మళ్లీ వినియోగం భారీగా పెరిగింది. కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుని వినియోగిస్తున్నారు. లేబుల్‌ లేకుండా పశు పోషకులకు అంటగడుతున్నారు. 100 ఎంఎల్‌ ఆక్సిటోసిన్‌ రూ. 300 ప్రకారం విక్రయిస్తున్నారు. కర్నూలు, నంద్యాల, డోన్‌, ఆదోని, ఎమ్మిగనూరు తదితర పట్టణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విషం పొంగుతోంది!1
1/1

విషం పొంగుతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement