సమగ్ర శిక్ష ఉద్యోగుల వంటావార్పు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ వద్ద ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా గురువారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమానికి తపస్ జిల్లా అధ్యక్షుడు శేర్ క్రిష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బలరాం, కమ్యూనిస్టు నాయకుడు కాశీనాథ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సయగ్ర శిక్షలో పని చేస్తున్న వారికి చాలీచాలని జీతాలు ఇస్తున్నారన్నారు. గతేడాది ఉద్యమ సమయంలో అప్పటి ీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో రాజు, శశిధర్, మహిపాల్, గౌరమ్మ, శాలిని, గంగమ్మ, విజయ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment