అంతా కేంద్రం చేతుల్లోనే.. | CM Chandrababu request to Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

అంతా కేంద్రం చేతుల్లోనే..

Published Sun, Aug 18 2024 5:39 AM | Last Updated on Sun, Aug 18 2024 7:12 AM

CM Chandrababu request to Prime Minister Narendra Modi

రూ.15 వేల కోట్ల రుణం త్వరగా ఇప్పించండి 

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి 

ఆర్థిక, హోం మంత్రులతోనూ భేటీ

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కేంద్రం చేతుల్లోనే ఉందని, అందువల్ల నిధులు త్వరగా మంజూరు చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణ సాయం, పోలవ­రం నిర్మాణ ఖర్చు, వెనకబడిన జిల్లాలకు నిధు­లపై కేంద్రం ఇచ్చిన హామీ మేరకు నిధులు వెంటనే ఇచ్చేలా చూడాలని కోరినట్లు తెలిసింది. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి ప్రధాని మోదీకి తిరుమల శ్రీవారి ప్రతిమ బహూకరించారు. అనంతరం ప్రధానితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుమారు గంట సేపు చర్చించారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రూ.15 వేల కోట్ల రుణ సాయం తక్షణమే వచ్చేలా చూడాలని ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. దీంతోపాటు కొత్తగా రుణాలు వచ్చే అవకాశాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఏపీకి విడుదల చేయాల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం.  

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నిరసనపై ఆరా 
ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. చంద్రబాబును ఆరా తీసినట్లు తెలిసింది. ఆయా ఘటనలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఫొటో, వీడియోలతో నిరసన ప్రదర్శన వివరాలను కేంద్ర ఇంటెలిజెన్స్‌ ద్వారా తెప్పించుకొని.. వాటిపై వివరణ కోరినట్లు సమాచారం. 

ఈ ఘటనలకు కారణాలు, ప్రజల్లో విశ్వసనీయత తగ్గిపోయే పరిణామాల గురించి చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా హోం శాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం చంద్రబాబు సుమారు గంట సేపు చర్చించారు. ఎక్కువ సమయం కూటమి కార్యకర్తల హింసాత్మక దాడులపైనే చర్చ జరిగినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement