ఛండీగఢ్: లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానా రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అధికార బీజేపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో హర్యానా సీఎం సైనీ మాట్లాడుతూ.. ముగ్గురు ఎమ్మెల్యేల మద్దుతు లేకున్నా తన ప్రభుత్వానికి ముప్పు లేదన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తోసిపుచ్చారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ముగ్గురు ఎమ్మెల్యేల ఆకాంక్షలు నెరవేరుస్తుందని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ఆశలు ఉంటాయి. కానీ ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయి. తమ ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు. కానీ, వారి వ్యక్తిగత ఆకాంక్షలు మాత్రమే నెరవేరుస్తారు అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతును ఉపసంహరించుకున్నారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్, రణ్ ధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
VIDEO | "I have received this information. Some MLAs have their desires... Congress is fulfilling the desires, but people know everything. Congress is not concerned about the desires of people, but only about itself," says Haryana CM Nayab Singh Saini (@NayabSainiBJP) as three… pic.twitter.com/pmWwmF5oz1
— Press Trust of India (@PTI_News) May 7, 2024
ఇక, వీరు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఈ పొలిటికల్ ట్విస్ట్ అనంతరం.. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. మైనారిటీలో పడిన హర్యానా ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదన్నారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. వారికి ధన్యవాదాలు. అయితే, హర్యానాలో ప్రస్తుతం బీజేపీకి జేజేపీ, స్వతంత్ర అభ్యర్థుల సపోర్టు కూడా లేదు. ప్రభుత్వం కొనసాగించే అర్హత లేదన్నారు.
సమీకరణాలు ఇలా..
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మనోహర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా, రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అందువల్ల మిగిలి ఉన్న సభ్యుల సంఖ్య 88. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు 45. ఇక, ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హర్యానా లోఖిత్ పార్టీ 1 సీటు, 2 స్వతంత్రులను కలుపుకుంటే, ఎన్డీఏలో మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే బీజేపీ మెజారిటీకి ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం ఉంది.
మరోవైపు.. కాంగ్రెస్‌కు మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో, కాంగ్రెస్ మద్దతు సంఖ్య 33కు చేరుకుంది. ఇక, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, ఇటీవేల పలువురు జేజేపీ ఎమ్మెల్యేలు బీజేపీకి బైబై చెప్పారు. దీంతో, వారి నిర్ణయం కీలకంగా మారనుంది. అలాగే, మరో నలుగురు ఇండిపెండెంట్ల మద్దతు కూడా కీలకంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment