ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం
షహరాన్‌పూర్/అజ్మీర్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో స్వాతంత్య్ర ఉద్యమం నాటి ముస్లిం లీగ్ భావజాలాన్ని, ఆలోచనా విధానాన్ని పోలి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఒక్కటేనని పరోక్షంగా తేలి్చచెప్పారు. స్వాతంత్య్ర పోరాటం నాటి కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల క్రితమే అంతరించిపోయిందని చెప్పారు. మహాత్మా గాం«దీతోపాటు ఎందరో మహామహులకు కాంగ్రెస్‌తో అనుబంధం ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు మిగిలిపోయిన కాంగ్రెస్‌కు దేశ ప్రయోజనాల పట్ల ఒక విధానం, అభివృద్ధి పట్ల ఒక విజన్ లేవని ఆక్షేపించారు.
ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను పరిశీలిస్తే ప్రజల ఆశలు, ఆకాంక్షల నుంచి కాంగ్రెస్ పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోందన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లో ‘ఇద్దరు బాలలు’ అనే సినిమా గత ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైందని, అయినా ఈ ఎన్నికల్లో రీరిలీజ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గంటకొకరు మారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ వారసత్వ, అవినీతి పార్టీ
కాంగ్రెస్ లూటీ దుకాణాన్ని తాను మూసివేశానని, అందుకే ఆ పార్టీ ఆందోళన చెందుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో నెగ్గడానికి కాకుండా అవినీతిపరులను కాపాడడానికి కాంగ్రెస్ ర్యాలీలు, సభలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. శనివారం రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ముమ్మాటికీ వారసత్వ, అవినీతి పార్టీ అని ధ్వజమెత్తారు. ఆ పారీ్టకి విలువలు, సిద్ధాంతాలు లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment