1952లో దేశ జనాభా 36 కోట్ల 90 లక్షలకు చేరుకున్నప్పుడు కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రారంభించారు. అప్పుడు ప్రతి కుటుంబానికీ ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలనే ఎర్ర త్రికోణం గుర్తు ఎక్కడ పడితే అక్కడ కనిపించి అధిక ప్రాచుర్యం పొందింది. అయితే అత్యయిక పరిస్థితి కాలంలో సంజయ్ గాంధీ నిర్బంధ కుటుంబ నియంత్రణలు చేయించడంతో కుటుంబ నియంత్రణ అనేది ఒక చెడ్డ మాటగా ప్రచారం అయింది.
1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘోర పరాజయానికి దారి తీసిన కారణాలలో ఇది కూడా ఒకటనే ప్రచారం జరిగింది. కానీ, దక్షిణాది రాష్ట్రాలు అనుసరించిన నవ్య వ్యూహాలు, పథకాల ఫలితంగా జనాభా పెరుగుదల నియంత్రణలో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించింది.
1951లో 6శాతం ఉన్న సంతానోత్పత్తి రేటు 1999 నాటికి 2.5కి తగ్గింది. ప్రస్తుతం అయితే దాదాపు 140 కోట్ల జనాభా కలిగి, ప్రతి ఏడాదీ కోట్ల మంది అదనంగా జమ అవుతున్న భారతదేశంలో కుటుంబ సంక్షేమ పథకాలు, జనాభా నియంత్రణ చర్యలు విజయవంతం అవుతాయని ఆశించడానికి కొన్ని సందర్భాలలో సంశయం కలుగుతుంది.
(చదవండి: పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం)
Comments
Please login to add a commentAdd a comment