అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్ల ఆలయాల్లో ఆదివా రం భక్తుల సందడి నెలకొంది. గురుస్వామి జక్కని గజేందర్, అర్చకుడు నగేశ్ గజ్జలమ్మకు అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి.. తాటి శివ, కడార్ల హ రిప్రసాద్ ఆధ్వర్యంలో పల్లకీ సేవ నిర్వహించారు. బోనాలను నైవేద్యంగా సమర్పించారు. తలనీలాలు ఇచ్చారు. బంగారంతో తులాభారం వేయించి మొక్కులు చెల్లించుకున్నారు. కుంటాలకు చెందిన బుడుదుల కృష్ణ–సంగీత దంపతులు గజ్జలమ్మకు మూడు గ్రాముల బంగారు ముక్కు పుడక సమర్పించారు. ఈ సందర్భంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మేసినేని వెంకట్‌రావు, గజ్జారాం పటేల్, బోగ గోవర్ధన్ సన్మానించారు.
దాతను సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment