సాయిలు(ఫైల్)
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రానికి చెందిన తిప్పలబోయిన సాయిలు (42) రెండు రోజుల క్రితం దుబాయిలో గుండెపోటుతో మృతి చెందాడు. సాయిలు 20 ఏళ్లుగా బతుకు దెరువు కోసం దుబాయికి వెళ్తు వస్తున్నాడు. ఏడాది క్రితం సెలవుపై వచ్చి వెళ్లాడు. మృతదేహం త్వరగా స్వదేశానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment