ఘనంగా బాలల దినోత్సవం
సాక్షి నెట్‌వర్క్: నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో గురువారం భారత తొలి ప్రధాని దివంగత జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా పాఠశాలల్లో నెహ్రూ చిత్రపటానికి పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. పలు బడుల్లో స్వయంపాలన సందర్భంగా పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి, తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు హెచ్‌ఎంలు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే పలు పాఠశాలల్లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. నాగారంలో నిర్వహించిన బాలల దినోత్సవంలో బాలల న్యాయ మండలి చైర్‌పర్సన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుష్భు ఉపాధ్యా య్ పాల్గొన్నారు. నిజామాబాద్‌లోని రెడ్‌క్రాస్‌లో తలసేమియా వ్యాధి పిల్లలకు టీజీఎన్‌పీడీసీఎల్ సిబ్బంది పండ్ల్లు, అన్నదానం చేశారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, గ్రామాల్లో నెహ్రూ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో నెహ్రూ చిత్రపటం, విగ్రహాలకు వారు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. రాష్ట్ర ఉర్దూఅకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి రాంభూపాల్, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment