దాడి చేసిన వారిని శిక్షించాలి
నిజామాబాద్ అర్బన్ : వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ జేఏసీ, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన చేపట్టారు. నాయకులు శేఖర్, నాగరాజు, అలుక కిషన్, అమృత్‌కుమార్, రమణారెడ్డి, ప్రశాంత్, మోహన్‌రెడ్డి, కిషన్, యోహాన్, రవీందర్, గైని గంగారాం, కృష్ణమూర్తి, శ్రీనివాస్, కిశోర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment