నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ రూరల్: నగరంలోని వీహెచ్‌పీ జిల్లా కార్యాలయంలో గురువారం ప్రఖండ కమిటీల ఎన్నికలు నిర్వహించారు. గురువారం కోటల్లి, గాజుల్‌పేట, వినాయక్‌నగర్, ఎల్లమ్మగుట్ట ప్రఖండల 50 మంది కమిటీ సభ్యులను ఎన్నుకోగా, వారు బాధ్యతలు స్వీకరించారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ఠాకూర్, కార్యదర్శి గాజుల దయానంద్, ఉపాధ్యక్షుడు ఆనంద్, సహకార్యదర్శి దాత్రిక రమేష్,కోశాధికారి శేఖర్, నగర కార్యదర్శి రాంప్రసాద్, భజరంగ్‌దళ్ నాయకులు అఖిల్, సురేష్, మహేశ్, తదితరులున్నారు.
పశువులకు టీకాలు వేయించాలి
నిజామాబాద్ రూరల్: పశువులకు అంటువ్యాధులు రాకుండ టీకాలు వేయించాలని పశుసంవర్ధకశాఖ ఏడీఏ గంగాధరయ్య పేర్కొన్నారు. రూరల్ మండలంలోని శ్రీనగర్ గ్రామంలో గురువారం పశువైద్యశిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడిరైతులకు పశుపోషణపై పలు సూచనలు చేశారు. మండల పశువైద్యాధికారి బాబురావు, పశువైద్యనిపుణులు గోపికృష్ణ,శీరిష, చంద్రకాంత్, శివకుమార్, సునీల్‌కుమార్, శివకృష్ణ, పాడిరైతులు పాల్గొన్నారు.
ఘనంగా భీమన్న పండుగ
డిచ్‌పల్లి: మండలంలోని ఘన్‌పూర్ గ్రామంలో గురువారం ఆదివాసి నాయక్‌పోడ్ సంఘం ఆధ్వర్యంలో భీమన్న పండుగను వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం భజన కార్యక్రమం నిర్వహించారు. సంఘ సభ్యులు గంగాధర్, శేఖర్, సాయిలు, మోహన్, శ్రీను, సాగర్, బాలయ్య, సాయిబాబా, కిషన్, ఎర్రన్న, రాజు, సతీష్, భక్తులు పాల్గొన్నారు.
ఉద్యోగులు ఐకమత్యంతో ఉండాలి
నిజామాబాద్‌నాగారం: బీసీ ఉద్యోగులు ఐకమత్యంతో ఉండి, సమస్యల పరిష్కారానికి సహకరించా లని సంఘ అధ్యక్షుడు కరిపె రవీందర్ అన్నారు. జి ల్లా బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం గురువారం నగరంలోని జిల్లా కార్యాలయంలో జ రిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స మగ్ర సర్వే అధికారులకు బీసీ ఉద్యోగస్తులు సహకరించాలని, బీసీల వాటా తెలిస్తే బీసీలకు రాజకీయాలలో, ఉద్యోగా లలో అనేక అవకాశాలు దక్కుతాయన్నారు. సంఘ ప్రతినిధులు ఆంజనేయులు ఆకుల ప్రసాద్, చంద్రమోహన్, చిట్టి నారాయణరె డ్డి, ప్రభాకర్, నాగరాజు, రవిచంద్ర, గోవర్ధన్, ధు సూదన్, భూమన్న, విజయభాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment