రైల్వే అభివృద్ధికి అదనపు కేటాయింపులు
సుభాష్‌నగర్: రాష్ట్రంలో రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్‌లో 20 శాతం (సుమారు రూ.1000 కోట్లు) పెంచి కేటాయింపులు చేశారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధిపై లోక్‌సభలో తన ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పై సమాధానం ఇచ్చారని ఎంపీ పేర్కొన్నారు. మోదీ పాలనలో కేంద్ర ప్రభు త్వం దశాబ్దకాలంలో తెలంగాణలో 650 కిలోమీటర్లు కొత్త రైల్వే ట్రాక్ పనులు చేపట్టిందన్నారు. కాంగ్రెస్ పాలనలో (2009–14 వరకు)లో 87 కిలోమీటర్ల పనులు మాత్రమే ప్రారంభించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే బీజేపీ హయాంలో 647 శాతం కొత్త రైల్వే ట్రాక్ పనులు ప్రారంభించిందని, మోదీ పాలనలో తెలంగాణ రైల్వేకు మహర్దశ పట్టిందని ఎంపీ అర్వింద్ అన్నారు.
ప్రణాళికాబద్ధంగా బోధించాలి
● జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్
నిజామాబాద్‌అర్బన్: రానున్న వార్షిక పరీక్షలకు (2024 – 25 విద్యా సంవత్సరం) అధ్యాపకులు మిగిలిన 95 రోజులలో ప్రణాళిక బద్ధంగా బోధన చేసి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నా రు. ఆయన నిజామాబాద్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. అధ్యాపకుల బోధన తీరు పై విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. అధ్యాపకులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రయోగ తరగతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. విద్యార్జనలో వెనుకబడిన బడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. కళాశాలలో పేద, బడుగు బలహీన, మైనారిటీ, విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారని, మంచి విద్యా బోధన జరగాలన్నారు. కళాశాలలో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్‌న్సల్యాబ్‌ల నిర్వహణ కోసం నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. సిలబస్ పూర్తి చేయడంతో పాటు అధ్యాపకులు మరోసారి రివిజన్ చేయాలన్నారు. ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ వహించాలన్నారు. కళాశాలకు ఆలస్యంగా వచ్చిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ఫయిముద్దీన్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment