పరిస్థితి విషమించి మృతి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని చేపూర్ సమీపంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హార్వెస్టర్ డ్రైవర్ గంగారాం సోమవారం మృతి చెందాడు. కరీంనగర్ నుంచి ఆర్మూర్‌వైపు వస్తున్న పాడి లారీ హార్వెస్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో హార్వెస్టర్ డ్రైవర్ గంగారాం, దానిపై ఉన్న విశాల్, జీత్ బసర్‌తోపాటు లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. నలుగురిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి గంగారాం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు.
పేకాటస్థావరంపై దాడి
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని పెర్కిట్‌లో కొనసాగుతున్న పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేయగా ఏడుగురు పట్టుబడ్డారని, వారి నుంచి రూ.47,700 నగదుతోపాటు ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
పీఎంపీపై కలెక్టర్‌కు ఫిర్యాదు
ఎల్లారెడ్డి: సరైన పరిజ్ఞానం లేకుండా పీఎంపీ రవీందర్ ప్రజలకు వైద్యం చేస్తున్నాడని పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన కరణం స్వర్ణలత కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు సోమవారం ఫిర్యాదు చేసింది. మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న తనకు పీఎంపీ పెయిన్ కిల్లర్లు ఇచ్చాడని, అవి వాడడంతో శరీరమంతా బొబ్బలు ఏర్పాడి ప్రాణాపాయ స్థితికి చేరానని తెలిపారు. పీఎంపీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
కామారెడ్డి రూరల్: పట్టణంలోని ముదాంగల్లీలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లయీస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ముదాంగల్లీకి చెందిన లావణ్య ఇంట్లో తనిఖీ చేయగా, 15 క్వింటాళ్ల బియ్యం పట్టుబడిందన్నారు. 6ఏ కేసు నమోదు చేశామన్నారు.
ముగ్గురిపై చీటింగ్ కేసు
సిరికొండ: మండలంలోని ముషీర్‌నగర్ గ్రామానికి చెందిన మద్దికుంట అక్షిత్, మల్లవ్వ, అజయ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎల్ రామ్ తెలిపారు. గ్రామానికి చెందిన జంగిలి గంగాధర్ కూతురు స్నేహను అక్షిత్ ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పెళ్లి చేసుకోమని అడగ్గా స్నేహకు చెప్పకుండా అక్షిత్ వారం రోజుల క్రితం గల్ఫ్‌కు వెళ్లిపోయాడు. అక్షిత్ పారిపోవడానికి అతడి తల్లి మల్లవ్వ, అన్న అజయ్ సహకరించారని స్నేహ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
అంబులెన్స్ డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు
ఖలీల్‌వాడి: మద్యం సేవించి అంబులెన్స్ నడిపించిన డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నగరంలోని ఆర్‌ఆర్ చౌరస్తా నుంచి దేవి టాకీస్ చౌరస్తా వరకు సైరన్ ఆన్ చేసి డ్రైవర్ ఇసాక్ అంబులెన్స్‌ను వేగంగా నడిపించాడు. అంబులెన్స్ లో పేషెంట్ లేకున్న వేగంగా వెళ్లడంతో అనుమానం వచ్చి ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఎస్సై సంజీవ్ వెంబడించి పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment