ప్రశాంతంగా గ్రూప్–2 పరీక్ష
● మొదటిరోజు భారీ సంఖ్యలో
అభ్యర్థుల గైర్హాజరు
● రెండు సెషన్‌లలో పరీక్షరాయని
10 వేల మంది చొప్పున అభ్యర్థులు
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో గ్రూప్–2 పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొత్తం 63 సెంటర్‌లలో ఉదయం 10 నుంచి 12.30గంటల వర కు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. మొత్తం 19,855 మంది అభ్యర్థులకుగాను ఉదయం 9070 మంది హాజరుకాగా, 10785 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో సెషన్‌కు 9020 మంది అభ్యర్థులు హాజరుకాగా, 10,835 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారయ్యారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్యతో పోలిస్తే గైర్హాజరైన వారి సంఖ్యే ఎక్కువ. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షాకేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆది వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. రెండురోజులపాటు కొనసాగనున్న నాలుగు సెషన్‌ల పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా పూర్త య్యేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అన్నారు.
వెనుదిరిగిన అభ్యర్థులు
కంఠేశ్వర్ లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల సెంటర్‌కు ఇద్దరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని పరీక్షకు అనుమతించలేదు. అలాగే గిరిరాజ్ కళాశాల సెంటర్‌కు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులను లోనికి అనుమతించలేదు.
పరీక్షాకేంద్రాల పరిశీలన
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గ్రూప్–2 పరీక్షా కేంద్రాలను ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ ఆదివారం ఉదయం పరిశీలించారు. సెంటర్ల వద్ద విధులు నిర్వర్తించిన సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. 63 పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ప్రశాంతంగా పరీక్ష కొనసాగుతోందని ఆమె తెలిపారు. ఆమెవెంట డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, డీసీపీ(ఏఆర్ ) శంకర్ నాయక్, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. మధ్యాహ్నం పరీక్షాకేంద్రాలను డీసీపీ బస్వారెడ్డి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment