కలెక్టర్ ఆదేశించినా కదలిక లేదు
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో బాలుడు మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సాక్షాత్తు కలెక్టర్ ఆదేశించినా సంబంధిత అధికారులు కదలడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా వైద్యం చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నా ‘ఫైన్’లతో సరిపెడుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది మార్చిలో ధర్పల్లికి చెందిన దీక్షిత్ అనే 10 నెలల బాలుడు అస్వస్థకు గురికాగా కుటుంబ సభ్యులు నగరంలోని కిడ్స్‌కేర్ పిల్లల ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ తరువాత వైద్యులు కాలం చెల్లి న ఇంజక్షన్ ఇవ్వడంతో తమ బాబు మృతి చెందా డని దీక్షిత్ తల్లిదండ్రులు కలెక్టర్‌తోపాటు ఒకటోటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘ టనపై డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజానాదేవి ఆధ్వ ర్యంలో వైద్యులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఎక్స్‌పర్ట్ కమిటీతో వి చారణ చేయించాలని కోరడంతోపాటు తాము రూ పొందించిన నివేదికను అప్పటి డీఎంహెచ్‌వో ద్వా రా కలెక్టర్‌కు అందజేశారు. ఈ నేపథ్యంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వైద్యులతో సమగ్ర విచారణ చేయించి వారం రోజుల్లో నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. సుమారు నెలరోజులవుతున్నా విచారణ దిశగా జీజీహెచ్ వై ద్యుల బృందం ముందుకు వెళ్లలేదు. కలెక్టర్ ఆదేశించినా వైద్యాధికారులు అలసత్వం ప్రదర్శించడానికి కారణాలు ఏమిటని మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్ దృష్టి సారిస్తేనే..
ప్రైవేట్ ఆస్పత్రులపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తేనే ప్రజలకు స రైన వైద్యం అందడంతోపాటు వ్యవస్థ గాడిలో పడుతుందని ప్రజలు అంటున్నారు. కిడ్స్‌కేర్ ఆస్పత్రి ఘటనపై విచారణకు ఆదేశించినా ఇప్పటికీ అధికారులు నివేదిక ఇవ్వకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఫైన్‌లతో సరి..
బాలుడి మృతి ఘటనపై విచారణ పూర్తయ్యేనా?
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యం
జరిమానాలతో సరిపెడుతున్న
అధికారులు
నగరంలోని బోధన్ రోడ్డులో ఉన్న షాహిన్ ఆస్పత్రిలో ఈ ఏడాది మేలో వైద్యం వికటించి గర్భిణీకి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారితోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి డీఎంహెచ్‌వో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయించారు. అయితే ఆస్పత్రి నిర్వాహకులకు కేవలం రూ.10వేల ఫైన్ వేసి చేతులు దులుపుకున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్‌లో స్పై కెమెరాలు ఏర్పాటు చేసి రోగుల వీడియోలు రికార్డు చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రోగుల వీడియోలను రికార్డు చేసిన ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే స్కానింగ్ సెంటర్‌కు మాత్రం రూ.10వేల ఫైన్ వేసి వదిలేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment