విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా మురళి
మోర్తాడ్: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన రొక్కం మురళిని నియమిస్తూ వ్యవసా య శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో డైరెక్టర్‌గా కొనసాగిన సంజీవరెడ్డి దొన్కల్‌కు చెందిన వారు కావడం గమనార్హం. మరోసారి ఈ పదవి మోర్తాడ్ మండలానికే దక్కడం విశే షం. రైతుగా, సీడ్‌కు సంబంధించిన పలు అంశాలపై అవగాహన ఉన్న మురళిని విత్తనాభివృద్ధి సంస్థకు డైరెక్టర్‌గా ఎంపిక చేయడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశాభివృద్ధిలో విశ్రాంత ఉద్యోగుల పాత్ర కీలకం
నిజామాబాద్ నాగారం: దేశాభివృద్ధిలో వి శ్రాంత ఉద్యోగుల పాత్ర కీలకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నా రు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడా పోటీలను నగరంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘంలో ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిటైర్డ్ ఉద్యో గుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడ్యా ల రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పడాల భోజాగౌడ్, కోశాధికారి ఆశయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
అతిపెద్ద విద్యార్థి
సంఘం ఏబీవీపీ
నిజామాబాద్ రూరల్: ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని, దేశంలో ఎక్కడ ఏ విద్యార్థికి సమస్య ఉన్నా పోరాటం చేస్తోందని ఇందూర్ విభాగ్ సంఘటన మంత్రి రాజ్‌సాగర్ అన్నారు. నగరంలోని ఎస్‌ఎస్‌ఆర్ డిస్కవరీ పాఠశాలలో నిర్వహించిన ఏబీవీపీ శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా రాజ్‌సాగర్ మాట్లాడుతూ.. రెండు రోజులపాటు కొనసా గిన శిక్షణ తరగతుల్లో నాలుగు జిల్లాల వి ద్యార్థి ప్రతినిధులు ఎన్నో విషయాలు నేర్చు కున్నారన్నారు. కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ ప్రముఖ్ నరేశ్, జాతీయ కార్యవర్గ సభ్యులు బి శివకుమార్, నగర అధ్యక్షుడు వెంకటకృష్ణ, ఇందూరు జిల్లా ప్రముఖ్ ఈ శ్వర్, కామారెడ్డి జిల్లా ప్రముఖ్ గిరి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్‌గౌడ్, నాయకులు సునీల్‌సాయి, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment